పవనన్నా... ఇది మనందరి విజయం: డిప్యూటీ సీఎం ప్రశంసలకు లోకేష్ స్పందన
- ఏపీలో నిన్న పదో తరగతి ఫలితాలు విడుదల
- గతేడాది కంటే మెరుగ్గా ఫలితాలు
- పదో తరగతి ఫలితాలపై లోకేష్ ను ప్రశంసించిన పవన్
- ధన్యవాదాలు తెలిపిన లోకేష్
- కూటమి ప్రభుత్వ సంస్కరణలతోనే మెరుగైన ఫలితాలని వెల్లడి
- విద్యాశాఖను దేశానికే ఆదర్శంగా నిలుపుతామని హామీ
పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభినందించినందుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. "పవనన్నా ఇది మనందరి విజయం" అంటూ వినమ్రంగా బదులిచ్చారు. టీచర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాశాఖ, ప్రభుత్వం సమష్టిగా కృషి చేయడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. పవన్ కల్యాణ్ ప్రోత్సాహం, అందరి సహకారంతో ఏపీ విద్యాశాఖను దేశానికే రోల్ మోడల్‌గా నిలుపుతానని లోకేష్ స్పష్టం చేశారు.
అంతకుముందు, పదో తరగతి ఫలితాలపై పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. విద్యాశాఖలో మంత్రిగా నారా లోకేష్ అమలు చేస్తున్న ప్రణాళికలు ప్రశంసనీయమని, కూటమి ప్రభుత్వ సంస్కరణలతోనే అద్భుత ఫలితాలు వచ్చాయని అన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం సుమారు 4 శాతం పెరిగిందని పవన్ గుర్తుచేశారు.
ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత 72.8 శాతం నుంచి 78.39 శాతానికి పెరగడం శుభపరిణామమన్నారు. మెగా పేరెంట్ టీచర్స్ మీట్, పరీక్షలకు ముందు అమలు చేసిన 100 రోజుల ప్రణాళిక వంటివి సత్ఫలితాలనిచ్చాయని ఆయన వివరించారు. ఈ విజయం వెనుక ఉన్న ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులకు పవన్ అభినందనలు తెలియజేశారు.